క‌మెడీయ‌న్ విల‌నిజం పండుతుందా..!

Sat,December 30, 2017 01:20 PM
Seyal Tamil Movie Trailer

హీరోలు విల‌న్స్‌గా, విల‌న్స్ హీరోగా మార‌డం చూశాం. కాని క‌మెడీయ‌న్స్‌గా న‌వ్వించిన‌ న‌టులు విల‌న్స్‌గా మార‌డం చాలా అరుద‌నే చెప్ప‌వ‌చ్చు. జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో ఫుల్ పాపుల‌ర్ అయిన చ‌మ్మ‌క్ చంద్ర ఇప్పుడు వెండితెర‌పై విల‌న్‌గా కనిపించ‌నున్నాడ‌ట‌. మొద‌ట్లో బుల్లితెర‌పై సంద‌డి చేసిన చ‌మ్మ‌క్ చంద్ర‌కి టాలీవుడ్ తెర‌పై చిన్న చిన్న క్యారెక్ట‌ర్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం కోలీవుడ్‌లో విల‌న్‌గా త‌న టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. సెయల్ అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న పాత్ర‌లో చంద్ర విల‌న్‌గా కీల‌క పాత్ర పోషించాడు. ఈ మూవీతో త‌న విశ్వ‌రూపం చూపించి తెలుగులోను మంచి ఆఫర్స్ అందుకోవాల‌ని చంద్ర భావిస్తున్నాడ‌ని తెలుస్తుంది. రాజన్ తేజేశ్వర్, థరుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నసెయ‌ల్‌ సినిమాకి సిద‍్ధార్థ్ విపిన్ సంగీతమందిస్తున్నాడు. సీఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై సీఆర్ రాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ర‌వి అబ్బులు తెర‌కెక్కిస్తున్నాడు రీసెంట్‌గా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల అయింది. ట్రైల‌ర్‌లో చంద్ర పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్‌గానే ఉంద‌నిపిస్తుంది. మ‌రి ఇన్నాళ్ళు కామెడీతో న‌వ్వించిన చంద్ర త‌మిళ మూవీలో విల‌నిజంతో అల‌రిస్తాడా అనేది చూడాలి.


2506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles