యువతులను వేధించిన వినయ్‌ వర్మ అరెస్ట్‌

Tue,April 23, 2019 06:57 PM
Sexual Harassment Case Vinay Varma Arrested

హైదరాబాద్‌: హిమాయత్‌ నగర్‌లోని సూత్రధార్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వాహకుడు వినయ్‌ వర్మను నారాయణగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నటన నేర్చుకోవాలంటే అర్థనగ్నంగా నిలబడాలని వినయ్‌ యువతులను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. పై దుస్తులు విప్పితేనే నటనలో శిక్షణ ఇస్తానంటూ తనను వినయ్‌ వర్మ వేధించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అక్కడి నుంచి జైలుకు తరలించారు. యాక్టింగ్‌ స్కూల్‌ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని ఓ అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి షీటీమ్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

1935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles