మోదీ బ‌యోపిక్‌ను వీక్షిస్తున్న ఈసీ అధికారులు

Wed,April 17, 2019 04:19 PM
Seven EC Officials watching PM Narendra Modi biopic film

హైద‌రాబాద్‌: పీఎం న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ సినిమాను .. ఎన్నిక‌ల సంఘం అధికారులు వీక్షిస్తున్నారు. పీఎం మోదీ సినిమాపై స్టే విధించాలా వ‌ద్దా అన్న అంశంపై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌డుతున్న‌ది. అయితే సినిమాను పూర్తిగా చూసిన త‌ర్వాతే .. నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాల‌ని ఇటీవ‌ల సుప్రీం ఈసీని ఆదేశించింది. అయితే ఇవాళ ఏడు మంది ఈసీ అధికారులు పీఎం న‌రేంద్ర మోదీ సినిమాను వీక్షిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ప్రధాని మోదీ బయోపిక్ విడుదలపై విధించిన నిషేధాన్ని సమీక్షించాలని, ముందుగా సినిమాను చూసి తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇటీవ‌ల‌ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీకి) సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు మోదీ బయోపిక్‌ను రిలీజ్ చేయొద్దని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం చీఫ్ జస్టిస్ రంజన్‌గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈసీ ఈ నెల 19 లోగా నిర్ణయాన్ని తెలియజే యాలన్నది. నివేదికను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు అందజేయాలన్నది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. నిర్మాతల తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదిస్తూ కేవలం ఈ సినిమా ట్రైలర్‌ను చూసి ఈసీ నిషేధం విధించిందన్నారు.

928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles