ర‌కుల్ సీన్‌కి క‌త్తెరేసిన సెన్సార్ బోర్డ్

Thu,May 16, 2019 11:25 AM
sensor board orders to remove rakul seen in De De Pyaar De

అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ హిందీలో అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటించిన సినిమా దే దే ప్యార్ దేలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే .టబు చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది . ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అజ‌య్ ప్రియురాలిగా ర‌కుల్ అద‌రగొట్ట‌గా, ఆయ‌న మాజీ భార్య‌గా ట‌బు న‌టించారు. ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్రానికి సంబంధించి ‘వడ్డీ షరాబన్‌..’ అనే పాట విడుద‌ల చేశారు. ఈ పాటలో రకుల్.. చేతిలో మందు బాటిల్ పట్టుకొని తాగుతూ పంజాబీ స్టైల్‌లో ఆడుతూ.. పాడుతూ రచ్చ చేసింది. ఈ పాట‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే విస్కీ బాటిల్ ప‌ట్టుకొని ర‌కుల్ డ్యాన్స్ చేయ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఆ సీన్‌కి క‌త్తెరేసింది. ఆ సీన్‌ని తొల‌గించ‌డం లేదంటే బాటిల్ స్థానంలో పూల‌గుత్తి వాడండి అంటూ సెన్సార్ బోర్డ్ చిత్ర యూనిట్‌కి స‌ల‌హా ఇచ్చింది. దీంతో పాటు మ‌రో రెండు డైలాగ్స్ కూడా తొల‌గించాల‌ని టీం ఆదేశించింది. అకీవ్‌ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టీ సిరీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 17న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. అలోక్‌నాథ్ జిమీ షెర్గిల్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

2413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles