ఫ్రెష్ లుక్ కోసం శివాని సినిమాలో సీనియర్ యాక్టర్స్ ..

Sat,March 17, 2018 03:42 PM
seniors play crucial roles in 2 States Telugu Remake

ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘2 స్టేట్స్’. 2014లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ మళ్లీ చూడదగ్గ సినిమా ఇది అని విశ్లేషకులు, సినీ ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గీయులు ప్రశంసించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుంది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్గా వ్యవహరించిన వెంకట్ రెడ్డి తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకొని తెరకెక్కిస్తున్నారు. రాజశేఖర్ తనయురాలు శివానీ ఈ చిత్రంతో వెండి తెర ఎంట్రీ ఇస్తుండగా, అడవి శేషు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

2 స్టేట్స్ తెలుగు రీమేక్ చిత్రంకి ఫ్రెష్ లుక్ వచ్చేందుకు రెగ్యులర్ యాక్టర్స్ ని కాకుండా రేర్ యాక్టర్స్ ని సెలక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ హీరోయిన్ మదర్ పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ నటుడు రజత్ కపూర్ ని శివానీ తండ్రి పాత్ర కోసం ఎంపిక చేశారని టాక్. దిల్ చాహ్ తా హై, బేజా ఫ్రై వంటి చిత్రాలతో ఈయనికి మంచి పేరు వచ్చింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్నట్టు సమాచారం. ఇక్కడ విశేషం ఏంటంటే.. హిందీ చిత్రానికి ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరించిన ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పటివరకూ తమ సంస్థ నిర్మించిన ఏ చిత్రం రీమేక్ హక్కులను దక్షిణాదికి ఇవ్వలేదు. తొలిసారి ఈ సంస్థ రీమేక్ హక్కులను అమ్మిన చిత్రం ‘2 స్టేట్స్’.

2512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles