న‌డిరోడ్డుపై నృత్యం చేసిన శ్రియా శ‌ర‌ణ్‌

Sun,March 17, 2019 12:43 PM
Senior Actress Shriya Saran dancing on the road

18 సంవ‌త్స‌రాల సినీ కెరియ‌ర్ లో స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించిన అందాల భామ శ్రియ‌. 2002 లో సంతోషం సినిమాతో తొలి స‌క్సెస్ అందుకుంది శ్రియ శ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు వ‌యస్సు 36 ఏళ్ళు కాగా, ఇక ఆఫ‌ర్లు రావ‌డమే క‌ష్ట‌మ‌ని అంద‌రు అనుకున్నారు. కాని అంద‌రి అంచ‌నాలు మించేలా హీరోయిన్ పాత్ర‌ల‌తో పాటు కీల‌కమైన రోల్స్ చేస్తుంది. శ్రియ న‌టించిన న‌ర‌కాసురుడు చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, త‌మిళంలో న‌ర‌గ‌సూర‌న్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రిలీజ్‌కి సిద్దంగా ఉంది. చివ‌రిగా శ్రియ న‌టించిన న‌క్ష‌త్రం, పైసా వ‌సూల్‌, గాయ‌త్రి, వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. ఎన్టీఆర్ క‌థానాయకుడు చిత్రంలో కామియో రోల్ పోషించిన‌, పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి కిట్టిలో ప‌లు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే తాజాగా ఈ అమ్మ‌డు న‌డిరోడ్డుపై నృత్యం చేసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. విదేశాల‌లో ప్ర‌స్తుతం కార్నివ‌ల్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతుండ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా శ్రియ స్టెప్పులేసింది. ప్ర‌స్తుతం శ్రియ డ్యాన్స్ వీడియో వైర‌ల్ అయింది.

4534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles