స‌ల్మాన్ ప్రేయ‌సి పాడిన సాంగ్ విన్నారా..!

Fri,May 25, 2018 01:23 PM
Selfish Song Video from Race 3

స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ళుగా రొమెనియన్ భామ లులియా వాంటర్ తో చక్కర్లు కొడుతున్నాడు స‌ల్మాన్‌. అంతేకాదు ఆమెతో కలిసి పలు ఈవెంట్స్ కి కూడా హాజరు అవుతున్నాడు. ఈ క్రమంలో లులియా.. సల్మాన్ గార్ల్‌ ఫ్రెండ్ అని బీ టౌన్ మొత్తం కోడై కూస్తుంది. త్వరలో వీరిరివురు వివాహం కూడా జరగనుందని మరి కొందరు జోస్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం రేస్ 3లో లులియా ఓ పాట పాడటం చర్చనీయాంశంగా మారింది.

రెమో డిసౌజా దర్శకత్వంలో సల్మాన్ చేస్తున్న తాజా చిత్రం రేస్ 3. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా... అనిల్ కపూర్, డైసీ షా, బాబీ డియోల్, సాఖీబ్ సలీమ్, ఫ్రీడీ దరువాలా ముఖ్య పాత్రల్లో నటించారు. రంజాన్ కానుకగా జూన్ 15, 2018 న మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి వీడియో సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సెల్ఫిష్‌ సాంగ్ టీజర్ నిన్న విడుదల చేయగా, నేడు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అతీఫ్ అస్లామ్, లులియా వాంటర్ కలిసి పాడారు. ఇక్కడ మ‌రో ముఖ్య విశేషమేమంటే ఈ సాంగ్ కి లిరిక్స్ అందించింది కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్. రేస్ 3 చిత్రం ఫన్ తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఉంటుందని అంటున్నారు.

2298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS