డిసెంబర్‌లో సెట్స్ పైకి శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం

Tue,November 13, 2018 08:08 AM
sekhar kammula next movie goes on to the sets in december

స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆనంద్ , గోదావరి, హ్యపీ డేస్,లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి అద్బుత చిత్రాలని తెరకెక్కించాడు కమ్ముల. రీసెంట్ గా వరుణ్ తేజ్ , సాయి పల్లవి ప్రధాన పాత్రలలో ఫిదా అనే చిత్రాన్ని తెలంగాణ నేపథ్యంలో అందంగా తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమాకి కేసీఆర్, కేటీఆర్ లతో పాటు పలువురి ప్రముఖుల ప్రశంసలు కూడా లభించాయి. అయితే శేఖ‌ర్ క‌మ్ముల త‌దుప‌రి చిత్రంపై కొద్ది రోజుల నుండి ఎన్నో ప్ర‌చారాలు జ‌ర‌గ‌గా, దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే సోమ‌వారం త‌న‌ కొత్త సినిమాకి కొబ్బ‌రికాయ కొట్టారు. అమిగోస్‌ క్రియేషన్స్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నారాయణ దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ (తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌) నిర్మాతలు. త‌న చిత్రాల‌తో ఇండ‌స్ట్రీకి కొత్త వాళ్ళ‌ని ప‌రిచ‌యం చేసిన శేఖ‌ర్ క‌మ్ముల ఈ సినిమాలోను కొత్త వాళ్ళ‌నే న‌టింప‌జేయ‌నున్నార‌ట‌. రొమాంటిక్‌ మ్యూజికల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్టు, క్లాప్‌ బోర్డ్‌ పూజా కార్యక్రమాలు సికింద్రాబాద్‌లోని గణేష్‌ ఆలయంలో జరిగాయి. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబర్‌లో మొదలు కానుంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ‘ఏషియన్‌ గ్రూప్‌’ సునీల్‌ నారంగ్‌ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

1277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles