బిగ్ న్యూస్: అక్కినేని హీరోతో శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Thu,June 20, 2019 01:54 PM
sekhar kammula is going to direct  chay_akkineni and Sai_Pallavi

యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ని అందంగా తెర‌కెక్కించ‌గ‌ల ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల‌లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. ఫిదా అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన శేఖ‌ర్ క‌మ్ముల త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ విష‌యంలో చాలా స‌మ‌యం తీసుకున్నాడు. తాజాగా ఆయ‌న ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. అక్కినేని స్టార్ నాగ చైతన్య హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల త‌న తాజా ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. మ‌ల‌యాళ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి ఇందులో క‌థానాయిక‌గా న‌టించనుంది. ఆగ‌స్ట్ మొద‌టి వారం నుండి చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. స‌వ్య‌సాచి, శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాల త‌ర్వాత మ‌జిలీ చిత్రం చైతూకి కాస్త ఊర‌ట‌నిచ్చింది. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న చైతూకి శేఖ‌ర్ క‌మ్ముల ఆ గిఫ్ట్ ఇస్తాడా అనేది చూడాలి.


2181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles