ఏప్రిల్‌లో విడుద‌ల కానున్న చైతూ- సాయిప‌ల్ల‌వి చిత్రం

Tue,December 3, 2019 11:49 AM

నాగ చైత‌న్య- సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శేఖ‌ర్ క‌మ్ముల రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ల‌వ్ స్టోరీ పేరుతో ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల చైతూ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ ఒక‌టి విడుద‌ల చేశారు. ఇందులో చైతూ లుక్‌తో పాటు ఆయ‌న చేసే ప‌నులు ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగించాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అలరిస్తుంద‌ని చెబుతున్నారు. ఫిదా చిత్రం త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles