విజ‌య్ సేతుప‌తి 'సీతాకాతి' ట్రైల‌ర్ విడుద‌ల‌

Wed,November 21, 2018 12:49 PM
Seethakaathi Official Trailer  released

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ఈ మ‌ధ్య ఛాలెంజింగ్ పాత్ర‌లు చేస్తున్నాడు. ఇటీవ‌ల మ‌ణిరత్నం తెర‌కెక్కించిన నవాబ్‌లో నిజాయితీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించిన విజ‌య్ , 96 చిత్రంలో ఫోటో గ్రాఫ‌ర్‌గా క‌నిపించాడు. 96 చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా బాగా సుప‌రిచితం అయిన విజ‌య్ సేతుప‌తి మెగాస్టార్ 151వ చిత్రం సైరాలో బ్రిటీష్‌ వారి దగ్గర సిపాయిగా పనిచేసే భారతీయుడిగా విజయ్ కనిపిస్తాడని సమాచారం. ప్ర‌స్తుతం సీతాకాతి అనే సినిమాతో బిజీగా ఉండ‌గా,ఆ సినిమాలో విజ‌య్ కురు వృద్దుడిగా క‌నిపించ‌నున్నాడు. బాలాజీ తరీంతరన్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుండ‌గా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుద‌లైంది. ఇందులో విజ‌య్ లుక్స్ అంద‌రికి షాకింగ్‌గా మారాయి. ప్రోస్తెటిక్ మేక‌ప్ ద్వారా విజ‌య్ ఇలా మారాడ‌ని తెలుస్తుండ‌గా, దీని కోసం ఈ త‌మిళ హీరో చాలా శ్ర‌మిస్తున్న‌ట్టు తెలుస్తుంది. గోవింద్ పి మేనన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, మ‌రి కొద్ది రోజుల‌లో సినిమా విడుద‌ల కానుంది.

1022
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS