డిఫ‌రెంట్ గెట‌ప్‌లో విజ‌య్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

Fri,October 19, 2018 10:42 AM
Seethakaathi making video goes viral

విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచితం . మెగాస్టార్ 151వ చిత్రం సైరాతో విజ‌య్ సేతుప‌తి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో బ్రిటీష్‌ వారి దగ్గర సిపాయిగా పనిచేసే భారతీయుడిగా విజయ్ కనిపిస్తాడని సమాచారం. ఇక త‌మిళంలో వెరైటీ ప్ర‌యోగాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్ సేతుప‌తి రీసెంట్‌గా న‌వాబ్, 96 అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌ణిరత్నం తెర‌కెక్కించిన నవాబ్‌లో నిజాయితీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించిన విజ‌య్ , 96 చిత్రంలో ఫోటో గ్రాఫ‌ర్‌గా క‌నిపించాడు. 96 చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి.

తాజాగా విజ‌య్ సేతుప‌తి ఓ ఛాలెంజింగ్ పాత్ర చేస్తున్నాడు. సీతాకాతి అనే సినిమా కోసం విజ‌య్ కురు వృద్దుడిగా క‌నిపించ‌నున్నాడు. బాలాజీ తరీంతరన్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుండ‌గా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ విడుద‌లయ్యాయి. ఇందులో విజ‌య్ లుక్ అంద‌రికి షాకింగ్‌గా మారాయి. ప్రోస్తెటిక్ మేక‌ప్ ద్వారా విజ‌య్ ఇలా మారాడ‌ని తెలుస్తుండ‌గా, దీని కోసం ఈ త‌మిళ హీరో చాలా శ్ర‌మిస్తున్న‌ట్టు తెలుస్తుంది. గోవింద్ పి మేనన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, న‌వంబర్‌లో మూవీ రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి యూ స‌ర్టిఫికెట్ అందించారు.

4641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS