భవ్నానీ ఫ్యామిలీతో దీపిక.. వైరల్ ఫోటో

Mon,November 19, 2018 12:11 PM
Seen This Pic Of Deepika Padukone And Ranveer Singh Posing With The Bhavnanis?

దీప్‌వీర్.. గత కొన్ని రోజులుగా ఈ జంట గురించే కదా చర్చ. అది సోషల్ మీడియా కావచ్చు... ఇంకేదో మీడియా కావచ్చు. కానీ.. డిస్కషన్ మాత్రం ఈ జంట గురించే. వాళ్లు పెళ్లి చేసుకునే వేదిక దగ్గర నుంచి పెళ్లికి వాళ్లు వేసుకున్న డ్రెస్సులు, రణ్‌వీర్.. దీపికకు ప్రజెంట్ చేసిన రింగ్, ముంబైలోని వాళ్ల కొత్త బంగ్లా, పెళ్లి ఫోటోలు ఇలా అన్నీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. తాజాగా.. మరో ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది భవ్నానీ ఫ్యామిలీతో దీపిక దిగిన ఫోటో. హా.. భవ్నానీ ఫ్యామిలీనా.. వాళ్లెవరు అంటూ నోరెళ్లబెట్టకండి. రణ్‌వీర్ సింగ్ ఫ్యామిలీనే. వాళ్ల ఇంటి పేరు భవ్నానీ అన్నమాట. రణ్‌వీర్ సింగ్ తండ్రి, తల్లి, సోదరీమణులతో దీపిక ఫోటోకు పోజిచ్చింది. మీరు పైన చూస్తున్న ఫోటో అదే. సౌత్ ఇండియా సంప్రదాయం ప్ర‌కారం రెడీ అయి భవ్నానీ ఫ్యామిలీతో ఫోటో దిగింది కొత్త జంట.

1707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles