త‌మిళ ట్రైల‌ర్‌తో అల‌రించిన స‌మంత

Sun,September 2, 2018 08:09 AM
seema raja trailer released

చెన్నై బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం ఇటు తెలుగు అటు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. విశాల్‌తో చేసిన‌ ఇరుంబుతిరై అనే చిత్రంతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రాగా, తాజాగా శివ‌కార్తికేయ‌న్ మూవీ సీమ‌రాజాతో బిజీగా ఉంది. వరుత్తపడాద వాలిభర్‌సంఘం, రజనీమురుగన్‌ చిత్రాల దర్శకుడు పొన్‌రామ్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. గ్రామీణ క‌థ‌లో ఈ మూవీ తెర‌కెక్కుతుండ‌గా తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌కి అశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. మాస్ లుక్‌లో శివ‌కార్తికేయ‌న్ అద‌రగొడుతుండ‌గా, ప‌ల్లెటూరి అమ్మాయిగా స‌మంత అంద‌రి హృద‌యాల‌ని దోచుకుంటుంది. రంగ‌స్థ‌లంలో ప‌ల్లెటూరి భామ‌గా రచ్చ చేసిన సామ్ ఇప్పుడు సీమ‌రాజాలోను అదే స్టైల్‌లో అద‌రగొడుతుంద‌ని అంటున్నారు. ట్రైల‌ర్‌లో స‌న్నివేశాలు చూస్తుంటే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రించేలా క‌నిపిస్తుంది. వినాయ‌క చవితి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది. డి. ఇమాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే మూవీ ఆడియోని రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంది. సిమ్రాన్, సూరీ, నెపోలియన్, లాల్ మొదలగువారు ఈ చిత్రంలో నటించారు. సామ్ ప్ర‌స్తుతం తెలుగులో యూటర్న్ చిత్రంతో పాటు చైతూ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న సినిమాతోను బిజీగా ఉంది.

2317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles