మ‌రో త‌మిళ చిత్రంతో వస్తున్న స‌మంత‌

Sun,February 18, 2018 08:24 AM
మ‌రో త‌మిళ చిత్రంతో వస్తున్న స‌మంత‌

చెన్నై బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం ఇటు తెలుగు అటు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. ఇటీవ‌ల విశాల్‌తో ఇరుంబుతిరై చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సామ్ శివ‌కార్తికేయ‌న్ మూవీతో జ‌త‌క‌ట్టింది. వరుత్తపడాద వాలిభర్‌సంఘం, రజనీమురుగన్‌ చిత్రాల దర్శకుడు పొన్‌రామ్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. గ్రామీణ క‌థ‌లో ఈ మూవీ తెర‌కెక్కుతుండ‌గా యువ క‌థానాయ‌కుడు శివ‌కార్తికేయ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో కాళ్ళు పైకెత్తిన గుర్రంపై ధీమాగా కూర్చొని క‌నిపిస్తున్నాడు శివ‌కార్తికేయ‌న్‌. సీమ‌రాజా అనే టైటిల్‌తో చిత్రం రూపొందుతుంది. డి. ఇమాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే మూవీ ఆడియోని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్న టీం వినాయ‌క చవితిని పుర‌స్క‌రించుకొని సినిమాని రిలీజ్ చేయాల‌ని భావిస్తుంద‌ట‌. ఈ సినిమా కూడా స‌మంత‌కి మంచి పేరు తెస్తుంద‌ని అంటున్నారు . తెలుగులో సామ్ న‌టించిన రంగ‌స్థ‌లం మార్చి 30న విడుద‌ల కానుంది. మ‌హాన‌టిలోను ముఖ్య పాత్ర పోషిస్తుంది స‌మంత‌.

725

More News

VIRAL NEWS