వచ్చే వారంలో పవన్ స్టన్నింగ్ గిఫ్ట్

Thu,December 7, 2017 03:17 PM
వచ్చే వారంలో పవన్ స్టన్నింగ్ గిఫ్ట్

పవర్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. పవన్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు మంచి హిట్ కావడంతో అజ్ఞాతవాసి మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల అనిరుధ్ స్వరపరచిన బైటికొచ్చి చూస్తే అనే సాంగ్ ని విడుదల చేసిన యూనిట్ డిసెంబర్ 12న సెకండ్ సాంగ్ విడుదల చేయనున్నారట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది నిర్మాణ సంస్థ. తొలిసాంగ్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేయడంతో రెండో సాంగ్ ఎలా ఉంటుందనే దానిపై అభిమానులలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలగా నటించిన ఈ చిత్రంలో ఖుష్బూ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.


1049

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS