రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 2.0 చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులలో ఈ సినిమా జోష్ తగ్గక ముందే రజనీకాంత్ మరో చిత్రం పేటా నుండి వస్తున్న అప్డేట్స్ మరింత జోష్ని పెంచుతున్నాయి. ఇటీవల ‘ మరణ మాస్’ అంటూ తమిళ రాక్ స్టార్ అనురుధ్ స్వరపరిచిన సాంగ్‌ని విడుదల చేసిన టీం రేపు సాయంత్రం 6గం.లకి ఊల్లలా అనే సాంగ్‌ని విడుదల చేయనున్నారట. అఫీషియల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది చిత్ర బృందం. ఇది పక్కా మాస్ సాంగ్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. సంక్రాంతికి రానున్న ఈ పేటా చిత్రం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఈ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష , మెగా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.