పట్టాలెక్కనున్న మరో 'పద్మావతి'

Fri,December 15, 2017 03:28 PM
పట్టాలెక్కనున్న మరో 'పద్మావతి'

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పద్మావతి. డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదల కావలసి ఉన్నా పలు వివాదాల నేపధ్యంలో ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. కర్ణిసేన తో పాటు పలువురు రాజకీయనాయకులు ఈ సినిమాని వ్యతిరేఖించడంతో రిలీజ్ పై సందిగ్ధం నెలకొంది. ఇలాంటి పరిస్థితులలో రాజస్థాన్ కి చెందిన ఓ రచయిత పద్మావతి స్క్రిప్ట్ సిద్దం చేశారట. చిత్తోర్గఢ్ మహారాణి పద్మావతి అసలు ఎలా ఉంటుందో తన సినిమా ద్వారా చూపించబోతున్నానని నిర్మాత అశోక్ అన్నాడు. భన్సాలీ చెప్పినవన్నీ అవాస్తవాలే అని అశోక్ మీడియా ద్వారా తెలిపాడు. రాజస్థాన్ కి చెందిన కొందరు చరిత్రకారులతో చర్చించి సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేశామని అశోక్ చెబుతుండగా, ఈ చిత్రంలో కొత్త నటీనటులని తీసుకుంటారట. మై హూ పద్మావతి అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుండగా, ఈ మూవీని హిందీ, రాజస్థానీ భాషలలో చిత్రీకరించనున్నారు. 2018లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది.

1566
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS