అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరో తెలుసా?

Fri,August 17, 2018 03:00 PM
Scarlett Johansson is the highest paid actress in the world

సినీ అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపే విషయాల్లో నటీనటుల రెమ్యునరేషన్ కూడా ఒకటి. తమ అభిమాన నటి లేదా నటుడు ఒక్కో సినిమాకు ఎంత మొత్తం అందుకుంటున్నారో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇలా అత్యధిక రెమ్యునరేషన్లు అందుకుంటున్న హీరోయిన్ల జాబితాను ఫోర్బ్స్ ప్రతి ఏటా విడుదల చేస్తుంది. 2018 లిస్ట్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ లిస్ట్‌లో హాలీవుడ్ నటి స్కార్లెట్ జొహాన్‌సన్ 4 కోట్ల డాలర్లు (రూ.280 కోట్లు)తో తొలి స్థానంలో ఉంది. ఏడాది కాలంలో ఈమె మూడు సినిమాల్లో నటించింది. అయితే గతేడాది టాప్ టెన్‌లో ఉన్న దీపికా పదుకోన్ ఈసారి తన స్థానాన్ని కోల్పోయింది. దీంతో టాప్ టెన్‌లో ఒక్క భారతీయ నటి కూడా చోటు సంపాదించుకోలేకపోయింది.

గతేడాది అగ్రస్థానంలో ఉన్న ఎమ్మె స్టోన్‌ను వెనక్కి నెట్టి స్కార్లెట్ జొహాన్‌సన్ ఆ స్థానాన్ని ఆక్రమించడం విశేషం. అవెంజర్స్‌లో తన మూడో సినిమా చేయడంతోపాటు రాబోయే అవెంజర్స్ 4లోనూ నటించే అవకాశాన్ని కొట్టేయడంతో ఆమె ఫస్ట్ ప్లేస్‌కు దూసుకొచ్చింది. ఇక ఆమె తర్వాత ఏంజెలినా జోలీ రెండోస్థానంలో నిలిచింది. గతేడాది కాలంగా ఆమె ఒక్క సినిమాలోనూ నటించలేదు. 2020 వరకు కూడా జోలీ మూవీ ఏదీ రావడం లేదు. అయితే మేల్‌ఫిసెంట్ 2 మూవీ కోసం ఆమె ముందే భారీ చెక్కు అందుకోవడంతో జోలీ సంపాదన 2.8 కోట్ల డాలర్లు (రూ.196 కోట్లు)గా ఉంది. మూడోస్థానంలో జెన్నిఫర్ అనిస్టన్ (రూ.133 కోట్లు), జెన్నిఫర్ లారెన్స్ (రూ.126 కోట్లు) నాలుగో స్థానంలో, రీస్ విదర్‌స్పూన్ (రూ.115 కోట్లు) ఐదోస్థానంలో ఉన్నారు.

7366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles