కొత్త ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు సిద్ద‌మైన న్యూ క‌పుల్‌

Sun,March 17, 2019 10:35 AM
Sayyeshaa Saigal, arya team with teddy movie

మార్చి 10న మాంగ‌ల్య బంధంతో ఒక్క‌టైన కోలీవుడ్ న్యూ క‌పుల్ ఆర్య‌, సాయేషా సైగ‌ల్ కొత్త ప్రాజెక్ట్‌లో క‌లిసి న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారు. 2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ అనే చిత్రంలో తొలిసారి ఆర్య‌, సాయేషా క‌లిసి న‌టించారు. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ప్పం చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే వివాహానంత‌రం ఆర్య‌,సాయేషా న‌టించ‌నున్న‌ తొలి చిత్రం పేరు టెడ్డీ. శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం మే నుండి యూర‌ప్‌లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌ట‌. చిన్న పిల్ల‌ల‌తో పాటు యూత్ ఈ చిత్రానికి ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతార‌ని మేక‌ర్స్ అంటున్నారు. ఆర్య-సాయేషాల వివాహం హైద‌రాబాద్‌లో జ‌ర‌గగా, రిసెప్ష‌న్‌ని చెన్నైలో గ్రాండ్‌గా నిర్వ‌హించారు. వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు హీరో ఆర్య . అఖిల్ అనే చిత్రంతో టాలీవుడ్ అభిమానుల‌ని ప‌ల‌క‌రించిందిస‌యేషా సైగ‌ల్.

1812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles