హానీమూన్‌లో హాయి హాయిగా..

Sat,March 23, 2019 08:47 AM
Sayyeshaa Saigal and arya enjoyed in honeymoon

మాంగ‌ల్య బంధంతో మార్చి 10న ఒక్క‌టైన జంట ఆర్య‌, సాయోషా సైగ‌ల్ ప్ర‌స్తుతం హ‌నీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. హ‌నీమూన్ కోసం విదేశాలకి వెళ్లిన వారు లైఫ్‌లో ఎప్ప‌టికి ఓ మెమోరీగా ఉండేలా ఫోటోలు దిగుతున్నారు. సాయేషా భ‌ర్త ఆర్య త‌న కెమెరాలో సాయేషాని బంధించాడు. ఆ ఫోటోల‌ని సాయేషా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ సూర్య‌కాంతి స‌మ‌క్షంలో మా ప్రేమ‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నామ‌ని తెలిపింది. అంతేకాదు త‌న పోస్ట్ చేసిన ఫోటోల‌కి క్రెడిట్ త‌న హ‌స్బెండ్‌కి ఇచ్చింది. 2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ అనే చిత్రంలో తొలిసారి ఆర్య‌, సాయేషా క‌లిసి న‌టించారు. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ప్పం చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే వివాహానంత‌రం ఆర్య‌,సాయేషా టెడ్డీ అనే సినిమాలో న‌టించేందుకు సిద్ద‌మ‌య్యారు . శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం మే నుండి యూర‌ప్‌లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌ట‌. చిన్న పిల్ల‌ల‌తో పాటు యూత్ ఈ చిత్రానికి ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతార‌ని మేక‌ర్స్ అంటున్నారు.

3807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles