రియ‌ల్ లైఫ్‌లోనే కాదు రీల్ లైఫ్‌లోను ..

Sun,May 26, 2019 07:26 AM
Sayyeshaa Saigal and Arya  creates new magic

మార్చి 10న మాంగ‌ల్య బంధంతో ఒక్క‌టైన కోలీవుడ్ న్యూ క‌పుల్ ఆర్య‌, సాయేషా సైగ‌ల్. 2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ చిత్రంలో వారిద్ద‌రు క‌లిసి న‌టించ‌గా, ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు మ‌ధ్య ప్రేమ ఏర్ప‌డింది. ఆ ప్రేమ పెళ్లిగా మారింది. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ప్పం చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే వివాహానంత‌రం ఆర్య‌,సాయేషా న‌టించ‌నున్న‌ తొలి చిత్రం పేరు టెడ్డీ. శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. చిన్న పిల్ల‌ల‌తో పాటు యూత్ ఈ చిత్రానికి ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతార‌ని మేక‌ర్స్ అంటున్నారు. స్టూడియో గ్రీన్ బేన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్య‌, సాయేషా ఫ‌స్ట్ పార్ట్‌లో ప్రేమికులుగా, సెకండాఫ్‌లో భార్య‌భ‌ర్త‌లుగా క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

3659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles