చైతూ అభిమానులకి బర్త్ డే గిఫ్ట్

Wed,November 22, 2017 03:11 PM
చైతూ అభిమానులకి బర్త్ డే గిఫ్ట్

అమాయకంగా, అందంగా కనిపించే హీరో ఎవరంటే నాగచైతన్య ఠక్కున గుర్తుకొస్తాడు. 2009లో జోష్ సినిమాతో టాలీవుడ్ లో ఎంటరయిన చైతూ ఆ తర్వాత ఏం మాయ చేశావే, దడ, 100% లవ్, బెజవాడ, తడాఖా, మనం, ఒక లైలాకోసం, ఆటో నగర్ సూర్య, దోచెయ్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో, ఆటాడుకుందాం రా, రారండోయ్ వేడుక చూద్దాం, యుద్ధం శరణం సినిమాలు చేశాడు. ఒక్క 2012లో తప్ప ప్రతి ఏటా చైతూ పిక్చర్స్ రిలీజయ్యాయి.

ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి అనే సినిమా చేస్తున్నాడు చైతూ. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పెళ్ళి వలన కొన్నాళ్లు సినిమా షూటింగ్ కి దూరంగా ఉన్న చైతూ ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రేపు చైతూ బర్త్ డే కావడంతో చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం సవ్యసాచి మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానులకి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. ఇక మ్యారేజ్ తర్వాత చైతూకు ఇది ఫస్ట్ బర్త్ డే కాబట్టి చైతూ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆ హ్యాపీనెస్ తోనే తను చేయబోయే రోల్స్ విషయంలో సెలెక్టివ్ గా వ్యవహరిస్తున్నాడు నాగ చైతన్య.


1117

More News

VIRAL NEWS