బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ వీరేనా ?

Tue,June 11, 2019 08:32 AM
savitri selected as bigg boss contestant

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మంకి తెలుగులోను మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇప్ప‌టికే రెండు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ కార్య‌క్ర‌మం జూలైలో మ‌రో సీజ‌న్ జ‌రుపుకోనుంది. సీజ‌న్ 3ని నాగార్జున హోస్ట్ చేయ‌నున్నారని తెలుస్తుంది. ఇక కంటెస్టెంట్స్‌గా ప‌లువురి పేర్లు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. ఆ మ‌ధ్య గుత్తా జ్వాల పేరు ప్ర‌ముఖంగా వినిపించిన ఆమె త‌ను పార్టిసిపెంట్ చేయ‌డం లేద‌ని సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. తాజాగా తీన్మార్ కార్య‌క్ర‌మంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న సావిత్రి అలియాస్ జ్యోతి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో ఒక‌రు అని అంటున్నారు. అలాగే సీరియల్ యాక్టర్ జాకీ, యాంక‌ర్ ఝాన్సీ, వరుణ్ సందేశ్ లాంటి సెలెబ్రిటీలు, బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

7685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles