ఈ దునియాలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ.. బ్లఫ్ మాస్టర్ టీజర్

Mon,October 15, 2018 10:33 PM
Satya Dev Bluff Master Teaser

జ్యోతిలక్ష్మీ సినిమాలో చార్మీ వెంట పడ్డ వ్యక్తి గుర్తున్నాడా? జ్యోతిలక్ష్మీ తర్వాత కొన్ని సినిమాల్లో కన్పించినా పూర్తి స్థాయి హీరోగా అతడి సినిమా రాలేదు. ఆయన పేరు సత్యదేవ్. ఆయన లీడ్‌రోల్‌లో నటిస్తున్న సినిమా బ్లఫ్ మాస్టర్. నందిత శ్వేత హీరోయిన్. ఈ మూవీ డైరెక్టర్ గోపీ గణేశ్, మ్యూజిక్ డైరెక్టర్ సునిల్ కశ్యప్ కాగా... ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజయింది. టీజర్ ప్రారంభంతోనే ఈ దునియాలో డబ్బు సంపాదించడం అన్నింటికన్నా చాలా ఈజీ అంటూ సత్య దేవ్ చెబుతుంటాడు. సినిమా టీజర్‌ను చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. టీజర్ మాత్రం సినీ అభిమానులను అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా టీజర్ చూసేయండి మరి..

4062
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles