స‌ర్కార్ తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ ఎప్పుడో తెలుసా ?

Tue,October 23, 2018 01:16 PM

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి త‌మిళంలోనే కాదు తెలుగులోను ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న సినిమా కోసం అభిమానులు వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తుంటారు. ఆయ‌న న‌టిస్తున్న స‌ర్కార్ త‌మిళ‌ టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. ఈ టీజ‌ర్ కేవ‌లం 5 గంట‌ల‌లోనే మిలియ‌న్‌కి పైగా వ్యూస్ సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ చిత్రం ప‌క్కా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన‌ట్టు అర్ధమైంది. మల్టీ మిలినియర్ అయిన విజయ్ తన ఓటును వినియోగించుకోవడానికి ఇండియా కి వస్తాడు ఆ తరువాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. అయితే తెలుగులోను సినిమాని విడుద‌ల చేయ‌నుండ‌గా, మూవీపై ఆస‌క్తి పెంచేందుకు తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేసేందుకు టీం ప్లాన్ చేసింది. ఈ రోజు సాయంత్రం 6గం.ల‌కి తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు.


స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ త‌న 62వ సినిమాగా స‌ర్కార్‌ చేస్తున్నాడు. సన్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నుండ‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్‌ 6న‌ ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.

2769
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles