పొలిటిక‌ల్ పంచుల‌తో సర్కార్ తెలుగు టీజ‌ర్

Wed,October 24, 2018 08:14 AM
Sarkar  Official Teaser Telugu

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్, స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తుపాకి, క‌త్తి సినిమాలు ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో స‌ర్కార్ చిత్రం రూపొందుతుంది. న‌వంబ‌ర్ 6న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర త‌మిళ టీజ‌ర్ ద‌స‌రా కానుక‌గా విడుద‌లై రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించింది. తాజాగా తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ వాయిస్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌లో ‘వాడొక కార్పోరేట్ రాక్షసుడు ఏ దేశానికి వెళ్లినా వాళ్లని నాశనం చేసే వెళ్తాడు.. వాడు ఇప్పుడు ఇండియా వచ్చాడు’ . ‘నేను ఏ కంపెనీని కొనడానికి రాలేదు. ఈ రోజు ఎలక్షన్ డే కదా నేను నా ఓటు వేయడానికి వచ్చాను’ అంటూ వేలు చూపించడం .. ‘ఇంకా ఒక్కరోజులో ఏం మారుతోందో.. మారబోతోందో ఓ మూలన కూర్చొని వేడుక చూడండి.. నేనో కార్పోరేట్ క్రిమినల్‌ని’, ‘మీ ఊరి నాయకుడ్ని మీరే కనిపెట్టండి ఇదే మన ‘సర్కార్’ లాంటి పొలిటికల్ పంచ్‌లు అభిమానుల‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్నాయి. విజ‌య్ 62వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలోన‌టించింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించాడు.

2016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles