కేర‌ళ‌లో విజ‌య్ సినిమాకి స‌మ‌స్య‌లు

Fri,November 16, 2018 10:04 AM
sarkar gets problems in kerala

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి త‌మిళంలో ర‌జ‌నీ, క‌మల్ త‌ర్వాత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సినిమాల‌పై అభిమానుల‌లో చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయి. అయితే ఈ మ‌ధ్య విజ‌య్ సినిమాలు ప‌లు వివాదాల‌లో చిక్కుకొని హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. విజ‌య్ చివ‌రి చిత్రం మెర్స‌ల్ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ కొట్టిన , ఇందులో జీఎస్టీకి సంబంధించిన డైలాగ్స్ తో పాటు దేవాలయాలు, వైద్యుల గురించి - కార్పొరేట్ హాస్పిటళ్ల గురించి విజయ్ పేల్చిన సెటైర్లు అనేక వివాదాలకి దారి తీశాయి. ఇక ఇప్పుడు స‌ర్కార్ సినిమాలో విజ‌య్ సిగ‌రెట్ తాగ‌డంతో పాటు ఉచిత మిక్సీ, గ్రైండర్‌, ఫ్యాన్‌ను పగలగొట్టే సన్నివేశాలు లేని పోని స‌మ‌స్య‌ల‌ని తెచ్చిపెడుతున్నాయి.

ఉచిత మిక్సీ, గ్రైండర్‌, ఫ్యాన్‌ను పగలగొట్టే సన్నివేశాలు పాల‌క పార్టీ మ‌నోబావాలు దెబ్బతీసేలా ఉన్నాయ‌ని అన్నాడీంఎకే వ‌ర్గాలు ఇటీవ‌ల ఆందోళ‌న చేశాయి. అంత‌క‌ముందు స‌ర్కార్ మూవీ ఫ‌స్ట్ లుక్‌లో విజ‌య్ సిగ‌రెట్ తాగుతున్న‌ట్టు ఉండ‌డంతో ఎంపీ, మాజీ ఆరోగ్య‌శాఖామంత్రి అన్భుమ‌ని రామ‌దాస్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా విజ‌య్ ఫ‌స్ట్‌లుక్‌పై విరుచుకు ప‌డ్డాడు. ఈ పోస్ట‌ర్ ద్వారా సిగ‌రెట్‌ని ప్ర‌మోట్ చేస్తున్నావా, ఇలా చేయ‌డం సిగ్గు చేటు అని ట్వీట్‌లో తెలిపారు . హైకోర్టు కూడా సిగ‌రెట్ తాగేలా ఉన్న పోస్ట‌ర్స్‌ని వెంట‌నే తొల‌గించాల‌ని పేర్కొంది. అయితే తాజాగా సర్కార్ సినిమా త‌మిళ‌నాడులో కాకుండా ప‌క్క రాష్ట్రం నుండి స‌మ‌స్య‌ని ఎదుర్కొంటుంది. జిల్లా వైద్యాధికారి డీఆర్ కేజే రీనా..స‌ర్కార్ సినిమా పోస్ట‌ర్ ద్వారా ధూమ‌పానం గురించి ప్ర‌చారం చేస్తున్న‌ట్టుగా ఉంది. ఇది రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి త‌ప్పుడు సంకేతాన్ని అందిస్తుంద‌ని కంప్లైంట్ చేశారు. మ‌రి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

1202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles