దీపావ‌ళికి మ‌హేష్ టీం ఇవ్వ‌నున్న స‌ర్‌ప్రైజ్ ఏంటో తెలుసా?

Wed,October 23, 2019 12:48 PM

ప్ర‌స్తుతం సెట్స్‌పైన ఉన్న సినిమాల‌కి సంబంధించిన స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌లు దీపావ‌ళికి రాబోతున్నాయి. అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఒక‌టి దీపావ‌ళి రోజున రానుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా, ఇక మ‌హేష్ మూవీకి సంబంధించిన స‌ర్‌ప్రైజ్ ఏంట‌నే దానిపై అభిమానులు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం దీపావ‌ళి సంద‌ర్భంగా స‌రిలేరు నీకెవ్వ‌రు మూవీ నుండి విజ‌య శాంతి లుక్ విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. 90లలో లేడీ సూపర్‌స్టార్‌గా అద్భుతమైన స్టార్‌డమ్‌ సంపాదించిన విజ‌య‌శాంతి మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో ఆమె లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో విజ‌య‌శాంతి రాయలసీమకు చెంది పవర్ ఫుల్ లేడీ పాత్ర‌లో కనిపించ‌నున్నార‌ట‌.


అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న స‌ర‌స‌న‌ ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

1621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles