మ‌హేష్ బ‌ర్త్‌డే గిఫ్ట్.. ఇంట్రో వీడియో

Fri,August 9, 2019 09:15 AM
Sarileru Neekevvaru THE INTRO released

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో స‌రిలేరు నీకెవ్వ‌రు అనే క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ రీసెంట్‌గా మొద‌లు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ షూటింగ్‌లో బండ్ల గ‌ణేష్‌, విజ‌య‌శాంతితో పాటు ప‌లువురు సినీ న‌టులు న‌టిస్తున్నారు. ర‌ష్మిక మంథాన క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో మ‌హేష్ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈరోజు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఇంట్రో వీడియో విడుద‌ల చేశారు. ఇందులో మహేష్ ఆర్మీ లుక్‌లో అద‌ర‌గొట్టాడు. ఫ్యాన్స్ మ‌హేష్‌ని ఆర్మీలుక్‌లో చూసి మురిసిపోతున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.

1291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles