మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదల

Fri,November 22, 2019 05:21 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా సినిమా టీజర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కన్పించనున్నారు. దిల్‌రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

1551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles