సూపర్ స్టార్ మహేష్ బాబు- హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల చిత్రబృందం మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ లోడింగ్ అవుతుందని.. టీజర్ అతి త్వరలోనే మీ ముందుకు రాబోతుందని సోషల్ మీడియా ద్వారా చిత్రయూనిట్ తెలిజేశారు. తాజాగా టీజర్ రిలీజ్‌కి సంబంధించిన సమాచారం అందించారు. సాయంత్రం 6.03ని.లకి సరిలేరు నీకెవ్వరు చిత్ర టీజర్ విడుదల తేది తెలపనున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులు టీజర్ విడుదల ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండగా, ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు.