బ్యూటిఫుల్ సారా.. అదిరిన పిక్స్‌

Thu,July 12, 2018 07:50 AM
Sara Tendulkar is winning the internet with her style pics from instagram

ముంబై: మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్షేషన్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ స్మైలింగ్ ఫోటో ఇప్పుడు అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. టీ కప్పు పట్టుకుని ఓ స్మైలింగ్ లుక్ ఇచ్చిన సారా ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. సాధారణ అమ్మాయిలా తన టీనేజ్ భావాలను ఆ ఫోటోలో సారా వ్యక్త పరిచినా.. సచిన్ అభిమానులు మాత్రం ఆమెను ఓ సెలబ్రిటీలాగా చూస్తున్నారు. ఆ ఫోటోకు ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ డ్రెస్సులతో సారా చాలా సింపుల్‌గా కనిపిస్తోంది. అప్పుడుప్పుడు పేరెంట్స్‌తో కనిపించే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మాత్రం ఫోటోలను అప్‌లోడ్ చేస్తూనే ఉంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టీనేజ్ గర్ల్స్ సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ తరహాలో.. సారా టెండూల్కర్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే సారా తన ఫేవరేట్ సింగర్ ఎడ్ షీరన్‌ను కూడా కలుసుకున్నది. ఆ ఫోటోను కూడా ఆమె తన అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అచ్చం తల్లి అంజలీ టెండూల్కర్ లాగే కనిపిస్తున్న 20 ఏండ్ల సారా ప్రతి ఫోటోలోనూ సింపుల్ స్టయిల్‌తో మెస్మరైజ్ చేస్తోంది.

Can't drink (tea) all day if you don't start in the morning ☕️

A post shared by Sara Tendulkar (@saratendulkar) on


🐥

A post shared by Sara Tendulkar (@saratendulkar) onSummer lovin’

A post shared by Sara Tendulkar (@saratendulkar) on


Tourist alert✨

A post shared by Sara Tendulkar (@saratendulkar) on


Mad frizz but I can’t complain☀️☀️☀️

A post shared by Sara Tendulkar (@saratendulkar) on


2276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles