ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సారా అలీఖాన్, సుశాంత్..

Thu,November 23, 2017 05:54 PM
ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సారా అలీఖాన్, సుశాంత్..


ముంబై: బాలీవుడ్ స్టార్లు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీఖాన్ కాంబినేషన్‌లో కేదార్‌నాథ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు డైరెక్టర్ అభిషేక్ కపూర్ సోషల్‌మీడియా ద్వారా ఇప్పటికే వెల్లడించాడు. కొంత గ్యాప్ తీసుకున్న ఈ మూవీ టీం మళ్లీ షూటింగ్‌తో బిజీ కానుంది. కేదార్‌నాథ్ సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అయినట్లు అభిషేక్ కపూర్ వెల్లడించాడు. ఆఫీస్‌కు తిరిగి రావడం హ్యాపీగా ఉంది. షూటింగ్ కోసం రెడీ అవుతున్నామని.. సారా, సుశాంత్‌తో కలిసి ఉన్న ఫొటోను అభిషేక్ కపూర్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా షేర్‌చేశాడు. కేదార్‌నాథ్ ప్రాంతంలో జరిగే లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నది. సారా అలీఖాన్‌కు ఇది డెబ్యూట్ మూవీ.

1319

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS