కేదార్‌నాథ్ నిషేధంపై హీరోయిన్ వ్యాఖ్యలు

Sun,December 9, 2018 04:14 PM
sara alikhan comments on kedarnath ban

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కేదార్‌నాథ్. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంపై ఉత్తరాఖండ్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై నిషేధం విధించడం తనను ఎంతో నిరాశకు గురిచేసిందని సారా అలీఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ప్రజల ఇష్టాయిష్టాలను గౌరవిస్తానని చెప్పింది. హిందూ యువతి, ముస్లిం యువకుడికి కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో మధ్య ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది.

తనకిష్టమైన ప్రాజెక్టుపై నిషేధం విధించడంపై సారా స్పందిస్తూ...ఈ కథను నేను కొంతమంది ప్రేక్షకులకు చెప్పాలనుకున్నా. ఈ సినిమాను ఉత్తరాఖండ్‌లో షూట్ చేశాం. సినిమా కోసం 40 రోజులు అక్కడే ఉన్నాం. నా జీవితంలోనే అత్యంత మధురమైన క్షణాలు ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. అయితే అలాంటి మధురానుభూతులను ఉత్తరాఖండ్ వాసులకు అందించకపోతున్నందకు నిరాశకు గురిచేస్తోంది. ఎందుకంటే ఆ ప్రాంతవాసులు నాకు చాలా ఇచ్చారు. కులం, మతం, జాతి అనే వాటిని నేను పరిగణలోకి తీసుకోను. ఈ చిత్రం ఎవరినీ విడదీయదు. కలుపుతుంది. ఓ నటిగా తన పాత్రకు తాను వంద శాతం న్యాయం చేశానని, నటిగా ప్రజల మనోభావాలను గౌరవిస్తా. ఈ చిత్రంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో నాకు తెలియదని చెప్పుకొచ్చింది సారా అలీఖాన్.

3137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles