బుర్ఖా ధ‌రించి థియేట‌ర్‌కి వెళ్లిన బాలీవుడ్ భామ‌

Thu,December 13, 2018 11:07 AM
sara ali khan went to theater with burkha

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, సారా అలీ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం కేదార్‌నాథ్‌. అభిషేక్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం 2013లో కేదార్‌నాథ్‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల నేప‌థ్యంతో తెర‌కెక్కింది . ప్రేమ ఓ యాత్ర అన్న ట్యాగ్‌లైన్‌ను సినిమాకు ఫిక్స్ చేశారు. భీక‌ర‌మైన వ‌ద‌ర‌ల మ‌ధ్య ఓ జంట‌లో చిగురించిన ప్రేమ‌ను డైర‌క్ట‌ర్ అత్య‌ద్భుతంగా చూపించారు. డిసెంబ‌ర్ 7న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. అయితే ఈ సినిమాపై స్పంద‌న ఎలా ఉందో స్వ‌యంగా తెలుసుకోవాల‌ని భావించిన హీరోయిన్ సారా బుర్ఖా వేసుకొని ముంబైలోని ఓ థియేట‌ర్‌కి వెళ్లింది. ప్రేక్షకులకు అనుమానం రాకుండా వారి మధ్యే కూర్చొని తన తొలి చిత్రాన్ని ఎంజాయ్ చేసింది. అనంతరం సోషల్ మీడియాలో విషయాన్ని వెల్లడిస్తూ థియేటర్‌లో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసి షాక్ అయిన ప్ర‌జ‌లు సారా నువ్వు మ‌మ‌ల్ని చీట్ చేశావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

3944
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles