దంగల్ నటి కొత్త సినిమా ఫొటోలు వైరల్

Mon,June 25, 2018 05:01 PM
Sanya malhotra pataakha stills goes viral

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్‌తో దంగల్ సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సన్యామల్హోత్రా. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా రెజ్లర్ బబితా పోగట్ పాత్రలో కనిపించింది. ఈ నటి తాజాగా గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాలో నటిస్తోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పటాఖా. రాధికా మోహన్ కీలక పాత్రలో నటిస్తుంది.

సన్యామల్హోత్రా, రాధికా మోహన్ అక్కాచెల్లెళ్లుగా కనిపించనున్నారు. తన కొత్త చిత్రానికి సంబంధించిన ఫొటోలను సన్యా మల్హోత్రా ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. గోధుమ చేనులో సన్యామల్హోత్రా కనిపిస్తుండగా..రాధికా మోహన్ బీడీ తాగుతూ పెరుగును చిలుకుతూ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సునీల్ గ్రోవర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

2885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS