ట్వీట్‌తో చిక్కుల్లో ప‌డ్డ స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్

Wed,September 19, 2018 12:38 PM
santosh sivan meme creates a  problem

సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్‌కి లేని పోని తంటాలు తెచ్చి పెట్టింది. స్టార్ హీరోల సినిమాల‌కి సిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన సంతోష్ శివ‌న్ అనేక పుర‌స్కార‌ల‌తో పాటు ప‌ద్మ‌శ్రీని కూడా అందుకున్నారు. అయితే త‌ను నిర్మాత‌ల‌ని ఉద్దేశిస్తూ ట్విట్ట‌ర్‌లో మీమ్స్‌ని పోస్ట్ చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. వివ‌రాల‌లోకి వెళితే సంతోష్ శివ‌న్‌.. నిర్మాత‌లు టెక్నీషియ‌న్స్‌కి డ‌బ్బులిచ్చేట‌ప్పుడు అరుచుకుంటూ కోపంగా ఉంటార‌ని, హీరోయిన్స్‌కి ఇచ్చేట‌ప్పుడు మాత్రం ప్ర‌శాంతంగా ఉంటార‌ని కుక్క ఫోటోతో ఉన్న మీమ్స్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైర‌ల్ కావ‌డంతో ప‌లువురు నిర్మాతలు ఈ స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న సంతోష్ శివ‌న్ వెంటనే త‌న ట్వీట్‌ని డిలీట్ చేసిన‌ప్ప‌టికి, అప్ప‌టికే జ‌ర‌గ‌రాని న‌ష్టం జ‌రిగింది. కొద్ది సేప‌టి త‌ర్వాత స‌మావేశం కానున్న నిర్మాత మండ‌లి ఈ విష‌యంపై చర్చించి ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై ఓ నిర్ణ‌యానికి వ‌స్తార‌ట‌. సంతోష్ శివ‌న్ రీసెంట్‌గా మ‌ణిరత్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన న‌వాబ్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

1336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS