సంక్రాంతి బ‌రిలో స్టార్ హీరోల సినిమాలు

Wed,May 22, 2019 08:33 AM
Sankranthi Race For 2020 Heats Up

సంక్రాంతి వ‌చ్చిందంటే థియేట‌ర్ల‌లో స్టార్ హీరోల సినిమాలు సంద‌డి చేయ‌డం ఖాయం. ఈ ఏడాది సంక్రాంతికి విన‌య విధేయ రామ‌, పేట‌, క‌థానాయ‌కుడు, ఎఫ్ 2 చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వీట‌న్నింటిలో ఎఫ్‌2 చిత్రం మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఇక వ‌చ్చే సంవ‌త్సరం సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాలు థియేట‌ర్స్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. మ‌హేష్ బాబు - అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెరకెక్క‌నున్న చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుండ‌గా,ఈ మూవీని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రో వైపు బాల‌కృష్ణ- కేఎస్ రవికుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రం కూడా సంక్రాంతి బ‌రిలోనే నిలుస్తుంద‌ట‌. వీటితో పాటు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ర‌జ‌నీకాంత్ ద‌ర్భార్, అల్లు అర్జున్‌- త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్స్ కూడా సంక్రాంతికి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌య్యాయ‌ని టాక్. మ‌రి సంక్రాంతి పందెంకోళ్ళలో విజ‌యం ఎవ‌రిని ఎక్కువ‌గా వ‌రిస్తుందో చూడాలి.

2559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles