106 సెంట‌ర్ల‌ల‌లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఎఫ్ 2

Sat,March 2, 2019 11:45 AM
Sankranthi Blockbuster F2 Complete 50 Successful Days

సంక్రాంతి బ‌రిలో స్టార్ హీరో సినిమాల‌కి పోటీగా నిలిచి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించిన కామెడీ ఎంటర్టైన‌ర్ ఎఫ్‌2 ( ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌). వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇప్ప‌టికి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ని రాబ‌డుతుంది. ఈ చిత్రం రూ. 140కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌తో సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల రారాజుగా నిలిచింద‌ని కొద్ది రోజుల క్రితం చిత్ర బృందం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిచింది . సౌత్ ఇండియాలో 140 కోట్ల గ్రాస్ సాధించిన తొలి మ‌ల్టీ స్టార‌ర్ మూవీగాను ఈ చిత్రం నిలిచింది. త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు చిత్రంలో క‌థానాయికలుగా న‌టించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించిన అనీల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రాన్ని కూడా మంచి వినోదం అందించే చిత్రంగా తెర‌కెక్కించి స‌క్సెస్ అయ్యాడు.

జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. 106 సెంట‌ర్స్‌లో ప్ర‌స్తుతం ఎఫ్ 2 చిత్రం స‌క్సెస్ ఫుల్‌గా న‌డుస్తుండ‌గా, కొన్ని చోట్ల ఇప్ప‌టికి థియేట‌ర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయట . చాలా ఏళ్ల తరువాత వెంకటేష్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఉన్న సినిమాలో నటించి ప్రేక్షకుల కడుపు చెక్కలు చేయ‌డంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కి క్యూ క‌డుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌లో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, అనసూయ, హరితేజ, సుబ్బరాజు, రఘబాబు, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, అన్నపూర్ణ, హరితేజ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించి సందడి చేశారు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రానున్న సంగ‌తి తెలిసిందే.

1605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles