బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొడుతున్న రణ్‌బీర్

Sun,July 1, 2018 03:19 PM
Sanju sets new Box Office record beats Padmaavat and Race 3

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంజూ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త రికార్డులు కొల్లకొడుతున్నది. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.73.35 కోట్లు వసూలు చేయడం విశేషం. 2018లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన సంజూ.. తాజాగా పద్మావత్, రేస్ 3 రికార్డులను బీట్ చేసింది. రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే రేస్ 3కి రూ.38.14 కోట్లు, పద్మావత్‌కు రూ.32 కోట్లు రాగా.. సంజూ మాత్రం రూ.38.6 కోట్లతో ఆ రికార్డును బద్ధలు కొట్టింది.

రాజ్‌కుమార్ హిరానీ మూవీలకు ఉన్న క్రేజ్‌తోపాటు ట్రైలర్‌కే అంచనాలకు మించి రెస్పాన్స్ రావడంతో సంజూ ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. చాలా వరకు సినిమాకు పాజిటివ్ రీవ్యూలు రావడం కూడా కలెక్షన్లకు కలిసొచ్చింది. సంజయ్ దత్ క్యారక్టర్‌లో రణ్‌బీర్ జీవించేశాడు. అతని పర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. సంజూలో రణ్‌బీర్‌తోపాటు పరేష్ రావల్, దియా మీర్జా, మనీషా కోయిరాలా, అనుష్క శర్మ, విక్కీ కౌషల్ నటించారు.

4011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS