బాహుబ‌లి రికార్డ్ బ్రేక్ చేసిన సంజూ

Mon,July 2, 2018 03:18 PM
Sanju scores big hit at boxoffice, earns 120 crores in first weekend

ముంబై : సంజూ ఫిల్మ్ బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తోంది. రిలీజైన తొలి వీకెండ్‌లో ఈ ఫిల్మ్ 120 కోట్లు వసూల్ చేసింది. సంజయ్ దత్ జీవితకథ ఆధారంగా తీసిన ఈ ఫిల్మ్‌లో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషించాడు. మొదటి మూడు రోజుల్లోనే వసూళ్లు 120 కోట్లు దాటాయని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. పద్మావత్, రేస్3, బాగీ2, రెయిడ్ కన్నా.. సంజూనే బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేసింది. రాజ్‌కుమార్ హిరానీ డైరక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విదు వినోద్ చోప్రా.. ఈ ఫిల్మ్‌కు నిర్మాతగా ఉన్నారు. పరేశ్ రావల్, మనీషా కోయిరాలా, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్, దియా మీర్జా, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్‌లు ఇతర పాత్రలు పోషించారు.
హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంజూ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. బాహుబలి2 పేరిట ఉన్న రికార్డును ఇది బ్రేక్ చేసింది. ఒక రోజు అత్యధిక వసూళ్లు చేసిన హిందీ ఫిల్మ్‌లో బహుబలి2 రికార్డు ఉంది. ఆ ఫిల్మ్ ఒక రోజు 46.50 కోట్లు వసూల్ చేసింది. సంజూ ఆ రికార్డును అధిగమించింది. సంజూ ఫిల్మ్ ఆదివారం ఒక్క రోజే 46.71 కోట్లను వసూల్ చేసింది.


5200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS