సంజూ.. రణ్‌బీర్ షో

Fri,June 29, 2018 03:30 PM
Sanju movie review


హైదరాబాద్ : సంజూ ఫిల్మ్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ సంజయ్ దత్ జీవితాన్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను తీశారు. ఇవాళ రిలీజైన సంజూ విమర్శకులను స్టన్ చేస్తోంది. రాజ్‌కుమార్ హిరానీ డైరక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌లో రణ్‌బీర్ ప్రధాన పాత్రను పోషించాడు. సంజూ రోల్‌లో రణ్‌బీర్ ఆకట్టుకున్నాడు. పరేశ్ రావల్ కూడా తన పాత్రను అద్భుతంగా పోషించాడు. బోమన్ ఇరానీ లేకుండా హిరానీ ఫిల్మ్ ఉండదేమో. ఈ ఫిల్మ్‌లోనూ బోమన్ ఇరానీ క్యారక్టర్ హైలైట్. ఇటీవ‌ల రిలీజైన‌ రాజీ ఫిల్మ్‌లో పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్‌గా చేసిన విక్కీ కౌశల్.. సంజూలో మరో కీలక పాత్ర చేశాడు. సంజూ ఫ్రెండ్‌గా విక్కీ కౌశల్ అద్భుతంగా నటించాడు.

సంజయ్ దత్ లైఫ్ ఓ మిస్టరీ. అత‌నో పోకిరి. అత‌నో డ్రగ్ బానిస. అతని లైఫ్‌లో ఇంకా ఎన్నో కోణాలున్నాయి. ఆ భావాలను రణ్‌బీర్ తన నటనలో ప్రదర్శించాడు. సంజయ్ దత్‌కు మరో రూపంగా రణ్‌బీర్ తన ట్యాలెంట్‌ను చూపించాడు. ఫస్ట్ హాఫ్‌లో మూవీ చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు. చాలా ఆసక్తిని కలిగించే విధంగా ఫస్ట్ హాఫ్‌ను డైరక్ట్ చేశాడు ఇరానీ. రణ్‌బీర్ తన నటనతో సంజూను ఓ బెస్ట్ హ్యూమన్‌గా ప్రజెంట్ చేశాడు. సంక్లిష్టమైన సంజయ్ దత్ జీవితాన్ని డైరక్టర్ ఇరానీ తనదైన స్టయిల్లో చిత్రీకరించాడు. కథను ఆసక్తికరంగా చెప్పాడు. మేకింగ్ స్టయిల్‌లోనూ తన పంథాను వీడలేదతను.

సంజయ్ దత్ ఉగ్రవాది కాదు. ఈ ఐడియానే సెకండ్ హాఫ్‌లో ప్రజెంట్ చేశాడు డైరక్టర్. అతను జైలుకు వెళ్లాల్సి వచ్చిన తీరు.. అతని జీవితంలోని చీకటి రోజుల్ని డైరక్టర్ చాలా చాకచక్యంగా తెరకెక్కించాడు. రణ్‌బీర్‌తో స్క్రీన్‌ను పంచుకున్న విక్కీ కౌశల్ ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆకట్టుకున్నాడు. కమలేశ్ లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ అవసరమన్న రీతిలో అతను నటించాడు. విక్కీ కౌశల్ రాబోయే రోజుల్లో బెస్ట్ యాక్టర్‌గా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయి. సంజయ్ దత్ లైఫ్‌ను స్క్రీన్‌పై చాలా ఆకర్షణీయంగా ప్రజెంట్ చేశాడు ఇరానీ. చాలా సహజంగా సంజూ క్యారక్టర్‌ను మలిచాడు. రణ్‌బీర్ కూడా ప్రతి ఫ్రేమ్‌లోనూ సంజయ్‌దత్‌ను సజీవం చేశాడు.

ప్రధానంగా సంజయ్ దత్‌లోని రెండు కీలక అంశాలను ఇరానీ ఈ ఫిల్మ్‌లో చూపించాడు. డ్రగ్స్‌కు బానిస కావడం.. ఆ తర్వాత ఉగ్రవాదం కేసులో జైలు శిక్ష అనుభవించడం. దత్ తన లైఫ్‌లో చేసిన పొరపాట్లను కూడా ఇరానీ తెరకెక్కించడం ఈ ఫిల్మ్‌కు మరో ప్లస్ పాయింట్. ఆ పొరపాట్లపై మాత్రం ఎక్కువగా శ్రద్ధపెట్టలేదు. కానీ ఆసక్తికరమైన ఫిల్మ్‌కు కావాల్సిన అన్ని అంశాలను సంజూలో ప్రజెంట్ చేశాడు. వాస్తవాన్ని వాస్తవంగా చూపించేందుకు ప్రయత్నించాడు. నిజం చెప్పాలంటే సంజూ.. రణ్‌బీర్ షో అనాల్సిందే. దత్ జీవితాన్ని తెలుసుకోవాలంటే.. రణ్‌బీర్ నటనను చూడాల్సిందే.

1791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles