'సంజు' డిలీటెడ్ వీడియో సాంగ్ విడుద‌ల‌

Thu,July 19, 2018 12:27 PM
SANJU  Bhopu Baj Raha Hain video song released

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.500.43 కోట్లు సాధించిన ఈ చిత్రం భారత్‌ వ్యాప్తంగా రూ.378.43 కోట్లు(గ్రాస్‌) పైన వ‌సూళ్లు సాధించింది . చిత్రంలో ర‌ణ్‌బీర్ న‌ట‌నకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సంజు చిత్రంలో ప‌రేష్ రావ‌ల్‌, మ‌నీషాకోయిరాల, దియా మీర్జా, సోనమ్ కపూర్‌, విక్కీ కౌశల్‌, జిమ్ సర్బ్‌, అనుష్క శర్మలు ముఖ్య పాత్ర‌లు పోషించారు. సంజూ మూవీలో సంజయ్ డ్రగ్స్ కి అలవాటు పడటం, 1993 బాంబ్ బ్లాస్ట్ జ‌రిగిన స‌మ‌యంలో అక్ర‌మ‌ ఆయుధాలని క‌లిగి ఉన్న కార‌ణంగా జైలు శిక్ష అనుభవించడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, మూవీల్లో సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొట్టడం.. ఇలా అన్ని కోణాలని చూపించారు. ప్రతీ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రణ్ బీర్. జూన్ 29న విడుద‌లైన సంజు చిత్రం ప‌లు రికార్డులని కొల్ల‌గొడుతుంది. తాజాగా చిత్ర నిడివి ఎక్కువైన కార‌ణంగా డిలీట్ చేసిన బోపు బాజ్ ర‌హా హై సాంగ్ విడుద‌ల చేశారు. ఓ ఈవెంట్‌లో ర‌ణ్‌బీర్, విక్కీ కౌశ‌ల్‌, క‌రీష్మా తన్నాలు చేసిన సంద‌డి సాంగ్‌లో చూపించారు. రోహాన్ అందించిన సంగీతానికి ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా విడుద‌లైన సాంగ్ కూడా సినీ ల‌వ‌ర్స్‌ని అల‌రిస్తుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

1222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles