300 కోట్ల బెంచ్‌మార్కు దిశగా ‘సంజూ’

Tue,July 10, 2018 08:26 PM
Sanju All Set To Cross Rs 300 Crore Mark soon


ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’ బాక్సాపీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తుంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 200 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. 11 రోజుల్లో ఈ చిత్రం రూ.260 కోట్లు వసూలు చేసింది. దీంతో అత్యధిక గ్రాస్ సాధించిన తొమ్మిదో హిందీ చిత్రంగా ‘సంజూ’ నిలిచింది. ఇక ఈ సినిమా త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరే దిశగా ముందుకెళుతున్నది. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అనుష్క శర్మ, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషించారు. సంజూ ఇప్పటివరకు సాధించిన కలెక్షన్లను షేర్ చేశాడు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్.

2228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles