బుజ్జిగాడు హీరోయిన్‌కి స‌ర్జ‌రీ

Wed,December 19, 2018 08:48 AM
Sanjjanaa Galrani Undergoes Surgery

తెలుగు, కన్నడం, తమిళ మూవీస్ లో సోయగాల వర్షం కురిపించిన సంజ‌న బుజ్జిగాడు, దండుపాళ్యం చిత్రాల‌తో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. అయితే త‌నకి స‌ర్జరీ జ‌రిగింద‌నే విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిజేసింది సంజ‌న‌. నా అండాశ‌యంలో 550 ఎంఎల్ డెర్మాయిడ్‌ని స‌ర్జరీ ద్వారా తీసేశారు. బెంగ‌ళూర్‌లోని మ‌ణిపాల్ ఆసుప‌త్రిలో నాకు ఈ స‌ర్జ‌రీ జ‌రిగింది. అందుకు నెల నుండి బ‌య‌ట‌కి రావ‌డం లేదు. ప్ర‌తి మ‌హిళ క‌నీసం ఆరు నెల‌ల‌కొక‌సారి అయిన మ‌మ్మోగ్రామ్ చేయించుకోవాల‌ని వాటితో పాటు అండాశ‌యం, గ‌ర్బాశ‌యంల‌కి సంబంధించి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సంజ‌న పేర్కొంది.ప్ర‌స్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్న‌ట్టు తెలిపిన సంజ‌నా త్వ‌ర‌లో ఎయిరో డ్యాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలిపింది. తెలుగులోని ప్ర‌ముఖ ఛానెల్‌లో భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న స్వ‌ర్ణ‌ఖ‌డ్గంలో సంజనా ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది.



3083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles