మాధురి దీక్షిత్ పేరెత్తగానే వెళ్లిపోయిన సంజయ్‌దత్.. వీడియో

Thu,April 5, 2018 02:02 PM
Sanjay Dutt walks out angrily when someone asked about Madhuri Dixit

సంజయ్‌దత్, మాధురి దీక్షిత్.. 1990ల్లో ఎన్నో హిట్ మూవీస్‌లో కలిసి నటించిన జంట. అయితే ఈ ఇద్దరి మధ్య అప్పట్లో అఫైర్ నడిచిందని ఈ మధ్య సంజయ్ ఆటోబయోగ్రఫీగా రచయిత చెప్పుకున్న ఓ బుక్‌లో రాశారు. అప్పటి నుంచి దీనిపై సంజయ్ గుర్రుగా ఉన్నాడు. అసలు ఆ బుక్‌కు తన అనుమతి లేదని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. తాజాగా కరణ్‌జోహార్ తర్వాతి సినిమాలో శ్రీదేవి స్థానంలో మాధురి దీక్షిత్ నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. శ్రీదేవి కూతురు జాన్వి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. మాధురి నటిస్తున్నందుకే సంజయ్ దత్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడని ఈ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే ముంబైలో జరిగిన ఓ క్రికెట్ టోర్నీ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ మాధురి దీక్షిత్ గురించి ఓ ప్రశ్న వేయగా.. సంజయ్ సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మాధురి పేరు వినగానే మారు మాట్లాడకుండా అతను వెళ్లిపోవడం రిపోర్టర్లను షాక్‌కు గురిచేసింది.

3572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles