బాల‌య్య‌కి విల‌న్‌గా సంజూ భాయ్..!

Thu,November 7, 2019 08:56 AM

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూల‌ర్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రిస్మ‌స్‌కి రానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ మూవీ త‌ర్వాత బాల‌య్య‌.. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే బోయ‌పాటి తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కి వ‌చ్చింది. బాల‌య్య‌కి విల‌న్‌గా బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్‌ని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఆయ‌న‌తో సంప్ర‌దింపులు కూడా మొద‌లు పెట్టార‌ట‌. ఇప్ప‌టికే కేజీఎఫ్ 2 చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్న సంజ‌య్ ద‌త్‌.. బాల‌య్య ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే మూవీకి మంచి హైప్ వ‌చ్చిన‌ట్టే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న బాల‌య్య- బోయ‌పాటి చిత్రాన్ని రెండు నెల‌లో పూర్తి చేసేలా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

1371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles