సంజ‌య్ కూతురిగా ఫీలింగ్ ఎలా ఉంద‌ని ప్ర‌శ్నించిన నెటిజ‌న్

Fri,July 13, 2018 01:46 PM

బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ జీవిత నేప‌థ్యంలో సంజూ అనే సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. రాజ్ కుమార్ హీరాణీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు ల‌భించాయి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 300 కోట్లకి పైగా వ‌సూళ్లు సాధించిన ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది. సంజూ మూవీలో సంజయ్ డ్రగ్స్ కి అలవాటు పడటం, 1993 బాంబ్ బ్లాస్ట్ జ‌రిగిన స‌మ‌యంలో అక్ర‌మ‌ ఆయుధాలని క‌లిగి ఉన్న కార‌ణంగా జైలు శిక్ష అనుభవించడం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, మూవీల్లో సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొట్టడం.. ఇలా అన్ని కోణాలని చూపించారు. ప్రతీ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రణ్ బీర్ . అయితే సంజూ చిత్రం విడుద‌ల త‌ర్వాత ప్ర‌తీ ఒక్క‌రిలో ఆయ‌న జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాల‌నే ఆస‌క్తి పెరిగింది. ఈ క్ర‌మంలో నెటిజ‌న్స్ సంజ‌య్ ద‌త్ కూతురిని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌శ్నిస్తూ త‌మ అనుమానాలని తీర్చుకున్నారు.

సంజ‌య్ ద‌త్ మొద‌టి భార్య రిచా శ‌ర్మ‌ కూతురు త్రిషాలా ద‌త్ ఎప్ప‌టి నుండో తండ్రికి దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఓ నెటిజ‌న్ త‌ల్లి తండ్రుల‌కి దూరంగా ఉంటున్నారు క‌దా , ఆ అనుభవం ఎలా ఉంది అని త్రిషాలాని అడిగారు . దీనికి త్రిషాలా చిన్న‌ప్పుడే వారి నుండి దూరంగా వెళ్ళాను. కాబ‌ట్టి ఆ జ్ఞాప‌కాలు నాకు గుర్తు లేవు. ఈ ప్ర‌శ్న‌కి స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేను. ఇక సంజ‌య్ ద‌త్ కూతురిగా మీ ఫీలింగ్ ఎలా ఉంద‌ని మ‌రో నెటిజ‌న్ ప్ర‌శ్నించ‌గా, ఇందుకు త్రిషాలా నార్మ‌ల్‌గానే ఉంద‌ని నిజాయితీగా చెప్పింది. నేను అత‌నితో ఉన్న‌ప్పుడు మా నాన్న‌తోనే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. మీకు మీ నాన్నతో ఉన్న ఫీలింగ్ కంటే ప్ర‌త్యేకంగా నాకు ఏమి ఉండ‌దు అని చెప్పింది. బాలీవుడ్ సినిమాలో న‌టిస్తారా అన్న ప్ర‌శ్న‌కి లేదు అని స‌మాధానం ఇచ్చింది త్రిషాలా.2842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles