ఆర్ఆర్ఆర్‌లో మ‌రో ఇద్ద‌రు బాలీవుడ్ న‌టులు..!

Sun,March 24, 2019 11:22 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బ‌డా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి రోజుకో వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇవి నెటిజన్స్‌కి థ్రిల్‌ని క‌లిగిస్తున్నాయి. చిత్రానికి దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ క‌లిగించేందుకు ఈ మూవీలో ప‌లువురు బాలీవుడ్ స్టార్స్‌ని రాజ‌మౌళి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్‌లు ఆర్ఆర్ఆర్‌లో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా, తాజాగా సంజ‌య్ ద‌త్, వ‌రుణ్ ధావ‌న్‌లు ఈ చిత్రంలో భాగం కానున్నార‌నే టాక్ వినిపిస్తుంది. ఇటీవ‌ల రాజ‌మౌళి వారిని సంప్ర‌దించ‌గా, ఆర్ఆర్ఆర్‌లో న‌టించేందుకు వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ పూణేలో జ‌రుగుతుంది. 47 రోజుల లాంగ్ షెడ్యూల్ అక్క‌డ జ‌ర‌ప‌నుండగా, ఇందులో కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తార‌ట‌. అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం క‌లిసి ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్జ‌ర్ జోన్స్‌ జోడి క‌ట్టింది. జూలై 30,2020న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు .

1925
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles